అన్నంత పనీ చేసిన కర్ణాటక మాజీ సీఎం
HD Kumaraswamy Says His Party And BJP Will Work Together In Karnataka. భారతీయ జనతా పార్టీ కూటమి లోకి మరో పార్టీ చేరింది.
By Medi Samrat
భారతీయ జనతా పార్టీ కూటమి లోకి మరో పార్టీ చేరింది. జేడీఎస్ కూడా భారతీయ జనతా పార్టీ అద్వర్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) లో భాగమైంది. ఇందుకు సంబంధించిఆ పార్టీ చీఫ్ కుమారస్వామి కీలక ప్రకటన చేశారు. బీజేపీతో కలిసి పని చేయబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలుపుతామని.. పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకునే అధికారాన్ని పార్టీ అధినేత దేవెగౌడ తనకు ఇచ్చారని తెలిపారు. జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశంలో దీనిపై చర్చించారు. కేంద్రంలోని బీజేపీ కూటమిలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ ప్రతిపక్ష పార్టీలనే విషయాన్ని తాను ఇప్పటికే చెప్పానని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించామని కుమారస్వామి చెప్పారు.
భారతీయ జనతా పారయీ ఆహ్వానం మేరకు ఇటీవల జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కి మద్దతుగా 38 పార్టీలు ఒక్కటయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుండి జనసేన పార్టీ మాత్రమే హాజరైంది. ఇంకా కొన్ని పార్టీలను కూడా కలుపుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. బీహార్‌లోని వికాశీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి), ఉత్తరప్రదేశ్‌లోని మహన్‌దళ్ వంటి పార్టీలను చేర్చుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ తమ కూటమిని విస్తరించే ప్రక్రియను కొనసాగిస్తోంది. ఆ పార్టీ నేతలతో బీజేపీ సీనియర్ నాయకులు భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల సమయానికి ఇంకొన్ని పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది.