డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఫర్‌లాఫ్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు హర్యానా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఈ నెల ప్రారంభంలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఫర్‌లఫ్ మంజూరు చేసిన ప్రాతిపదికన సమర్పించడానికి హర్యానా ప్రభుత్వానికి సోమవారం వరకు సమయం ఇవ్వబడింది. పంజాబ్‌లోని పాటియాలా నివాసి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఫర్‌లాఫ్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటీషన్‌లో, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తీవ్రమైన ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడ్డాడని, ఇప్పటికీ కోర్టులు విచారిస్తున్న అనేక ఇతర క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఫర్‌లాఫ్ మంజూరు చేయడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల ఫలితాలను మార్చడానికి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ప్రభావాన్ని చూపగలడని, అందుకే అతనికి మంజూరు చేసిన ఫర్‌లోను రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ డేరా సచ్చా సౌదా నాయకుడు. హర్యానాలోని సిర్సాలో ప్రధాన కార్యాలయం ఉంది. డేరా బాబాకు పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేలాది మంది అనుచరులు ఉన్నారు.