భార్య, కుమార్తె కోసం చిరుతపులితో పోరాటం.. చివరికి ఏమయిందంటే..
Hassan Man Killed Leopard To Save His Family. భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా చిరుతపులితో తలపడి చివరికి విజయం సాధించాడు.
By Medi Samrat Published on
23 Feb 2021 10:37 AM GMT

బెంగళూరు : భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా చిరుతపులితో తలపడి చివరికి విజయం సాధించాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా హరిసెక్రె తాలుకా బెండాక్రె ప్రాంతంలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తెతో కలిసి రాజ్‌గోపాల్ నాయక్ ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. మార్గమధ్యంలో అటుగా వచ్చిన పులి ఒక్కసారిగా బైక్ పైకి దూకింది.
దీంతో ముగ్గురు బైకు మీద నుంచి కిందపడిపోయారు. వెంటనే చిరుతపులి వారిపై దాడి చేసింది. చిరుత బారి నుంచి భార్య, కుమార్తెను రక్షించుకునేందుకు రాజ్‌గోపాల్ నాయక్ వీరోచిత పోరాటం చేశాడు. చివరికి దాన్ని హతమార్చి తమ ప్రాణాలను రక్షించుకున్నాడు. అప్పటికే పులి దాడిలో తీవ్రంగా గాయపడిన అతని భార్య, కుమార్తెతో సహా రాజ్‌గోపాల్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Next Story