హరీష్‌కు వైద్యం చేస్తానంటూ వనమూలికలతో వచ్చిన బాబా.. 6 గంటల పాటు గేటు వద్దే ఉండి..
రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన స్వామి అఖండానంద శుక్రవారం హరీష్ రాణాను కలిసేందుకు రాజ్ ఎంపైర్ సొసైటీకి చేరుకున్నారు.
By - Medi Samrat |
రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన స్వామి అఖండానంద శుక్రవారం హరీష్ రాణాను కలిసేందుకు రాజ్ ఎంపైర్ సొసైటీకి చేరుకున్నారు. ఆయన మూలికలు, ఆయుర్వేద మందులతో హరీష్ అనారోగ్యాన్ని నయం చేస్తానని పేర్కొన్నాడు. అయితే హరీష్ పరిస్థితి, వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు చికిత్స నిరాకరించారు. ఆ తర్వాత బాబా తిరిగి వెళ్లారు. కుటుంబాన్ని కలిసేందుకు బాబా సొసైటీ గేటు వద్ద దాదాపు ఆరు గంటల పాటు వేచి ఉన్నారు. తనను కలవడానికి ఎవరూ రాకపోవడంతో లేఖ పంపాడు. దీంతో హరీష్ తండ్రి అశోక్ రాణా ఆయన్ను కలిసేందుకు వచ్చారు.
అశోక్ రాణా బాబాకు నీళ్ళు ఇచ్చాడు. సంభాషణలో హరీష్‌కు అన్ని రకాల చికిత్సలు చేశామని చెప్పారు. అతడి మెదడులోని సిరలు ఎండిపోయాయని, రక్తం సరఫరా కావడం లేదని వైద్యులు తెలిపారు. దీని వల్ల మెదడు ఎక్కువగా ప్రభావితమవుతుందని పేర్కొన్నాడు.
అశోక్ రాణా ప్రకారం.. బాబా అనేక మూలికలు, ఆయుర్వేద ఔషధాల పేర్లను కూడా చెప్పారు. బాబా మొబైల్ నంబర్ తీసుకున్నాడు. ఈ తరహా వ్యాధితో బాధపడుతున్న చాలా మంది పిల్లల తల్లిదండ్రులు తనతో టచ్‌లో ఉన్నారని అశోక్ రాణా తెలిపారు. వారికి బాబా గురించిన సమాచారం అందిస్తాను. ఎవరి మందు, ప్రార్ధన ఎప్పుడు ఫలిస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు.
స్వామి అఖండానంద మాట్లాడుతూ.. హరీష్ గురించి వార్తల్లో వినగానే సేవాభావంతో ఆయుర్వేద మందులతో ఇక్కడికి చేరుకున్నానని చెప్పారు. కోమాలో ఉన్న లేదా పక్షవాతానికి గురైన రోగిని సకాలంలో తన వద్దకు తీసుకువస్తే, ఆయుర్వేద చికిత్సతో నయమవుతుందని పేర్కొన్నారు. ఇటీవల ఓ చిన్నారి తల్లిదండ్రులు సుమారు రూ.40 లక్షలు వెచ్చించి వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోగా, నాలుగు రోజుల్లోనే కోమా నుంచి చిన్నారిని బయటకు తీసుకొచ్చారని తెలిపారు. స్వామి అఖండానంద తనకు భిల్వారాలో ఆశ్రమం ఉందని చెప్పాడు. ఆయుర్వేదంలో ఎండీ చదివారు.
హరీష్ రాణాను శనివారం ఉదయం ఘజియాబాద్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఉదయం 8 గంటలకు రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న రాజ్ ఎంపైర్ సొసైటీ నుండి కుటుంబం అతనితో మూడు ప్రైవేట్ వాహనాల్లో బయలుదేరింది. ఈ సమయంలో అతనితో సన్నిహిత బంధువులు మాత్రమే ఉన్నారు.
గత 13 ఏళ్లుగా మంచాన పడి భరించలేని నొప్పితో బాధపడుతున్న హరీశ్‌కు అనాయాస (పాసివ్ యూథనేషియా)కు సుప్రీంకోర్టు నుంచి అనుమతి లభించిన తర్వాత ఎయిమ్స్‌లో ప్రక్రియను పూర్తి చేయాలని సీఎంఓ డాక్టర్ అఖిలేష్ మోహన్ తెలిపారు. ఈ క్రమంలోనే అతడిని ఘజియాబాద్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.