అక్కడ 11 రకాల విదేశీ కుక్కల జాతులపై నిషేధం..!
Gurugram bans 11 dog breeds due to rise in pet attacks. గురుగ్రామ్, ఘజియాబాద్ అధికారులు 11 విదేశీ కుక్కల జాతులను పెంపుడు జంతువులుగా నిషేధించారు.
By Medi Samrat
గురుగ్రామ్, ఘజియాబాద్ అధికారులు 11 విదేశీ కుక్కల జాతులను పెంపుడు జంతువులుగా నిషేధించారు. ఈ మేరకు రూ. 10,000 జరిమానాతో సహా తీసుకోవలసిన చర్యల జాబితాను విడుదల చేసింది. పెంపుడు కుక్కలు ప్రజలపై, కొన్ని సందర్భాల్లో యజమానులపై దాడి చేసే సంఘటనలు పెరగడం దీనికి కారణంగా అధికారులు పేర్కొన్నారు. అమెరికన్ బుల్‌డాగ్, అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్లు, డోగో అర్జెంటీనో, రోట్‌వీలర్, బోయర్‌బోయెల్, ప్రెస్ కానరియో, నియాపోలిటన్ మాస్టిఫ్, వోల్ఫ్‌డాగ్, కేన్ కోర్సో, బాండోగ్, ఫిలా బ్రసిలీరో అనే 11 విదేశీ జాతులను నిషేధించాలని జిల్లా వినియోగదారుల వివాదాల ఫోరమ్.. మున్సిపల్ కార్పొరేషన్ గురుగ్రామ్ (MCG)ని ఆదేశించింది. ఈ జాతులకు చెందిన కుక్కలు ప్రమాదకరమైనవి పేర్కొన్నారు.
నవంబర్ 15న పైన పేర్కొన్న పెంపుడు కుక్కలకు సంబంధించి అన్ని లైసెన్స్‌లు ఉంటే రద్దు చేయమని జిల్లా వినియోగదారుల వివాదాల ఫోరమ్ ఎంసీజీకి ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఆ జాతుల కుక్కలను కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశాలలో పేర్కొంది. పెంపుడు కుక్కల నమోదును నవంబర్ 15 నుంచి తప్పనిసరి చేయాలని ఆదేశించింది. ప్రతి సంవత్సరం రెన్యూవల్ ఫీజుతో కనీసం రూ.12,000 చొప్పున.. ఏడాదికి రూ.10,000కు తగ్గకుండా నెల రోజుల్లోగా లైసెన్సులు జారీ చేయాలని ఫోరం ఎంసీజీని ఆదేశించింది.
ప్రతి నమోదిత కుక్కకు కాలర్ తప్పనిసరి అని.. దానికి మెటల్ టోకెన్‌తో పాటు మెటల్ చైన్‌ను జతచేయాలని పేర్కొంది. నోయిడాలోని అధికారులు పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయడం తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను జారీ చేశారు. వారి పెంపుడు కుక్కలు ఎవరిపైనైనా దాడి చేస్తే యజమానులకు రూ. 10,000 జరిమానా విధించబడుతుంది. బాధితుల ఆసుపత్రి ఖర్చును కూడా వారే భరించాల్సి ఉంటుందని పేర్కొంది.