ఆటోలో మ‌హిళ‌.. భయంతో ఉన్నా.. ధైర్యం చేసి దూకేసింది.. ఏం జ‌రిగిందంటే..

Gurgaon Woman Shares Auto Ride Horror In Viral Twitter Thread. హర్యానాలోని గుర్గావ్ లో ఓ మహిళ ఆటోరిక్షా డ్రైవర్ తనను కిడ్నాప్ చేయడానికి

By Medi Samrat  Published on  22 Dec 2021 12:53 PM GMT
ఆటోలో మ‌హిళ‌.. భయంతో ఉన్నా.. ధైర్యం చేసి దూకేసింది.. ఏం జ‌రిగిందంటే..

హర్యానాలోని గుర్గావ్ లో ఓ మహిళ ఆటోరిక్షా డ్రైవర్ తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్లు వివరిస్తూ ట్విట్టర్‌లో సుదీర్ఘమైన వివరణను పోస్ట్ చేసింది. ఏకంగా కదులుతున్న వాహనంలోంచి దూకాల్సి వచ్చిందని చెప్పింది. ఈ సంఘటన తన ఇంటికి కేవలం ఏడు నిమిషాల దూరంలో ఉన్న గుర్గావ్ సెక్టార్ 22 వద్ద జరిగిందని మహిళ ట్వీట్ చేసింది.

నిష్ఠా తాను కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్ అని తెలిపింది. ఆటోరిక్షా డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా రాంగ్ టర్న్ తీసుకున్నాడని, తెలియని రహదారి వైపు డ్రైవ్ చేయడం కొనసాగించాడని ఆరోపించింది. ఆ తర్వాత ఆమె వద్దని చెబుతున్నా కూడా అతను స్పందించలేదు.

"నేను దాదాపుగా అపహరించబడ్డాను/కిడ్నాప్‌కి గురయ్యాను అని నేను భావిస్తున్నాను, నిన్న నా జీవితంలో అత్యంత భయానకమైన రోజులలో ఒకటి. అది ఏమిటో నాకు తెలియదు, ఇప్పటికీ నాకు వెన్నులో వణుకు కలిగిస్తోంది. మధ్యాహ్నం 12:30 గంటలకు, నా ఇంటికి 7 నిమిషాల దూరంలో ఉన్న బిజీ మార్కెట్ సెక్షన్ 22 (గుర్గావ్)లో నేను ఆటో స్టాండ్ నుండి ఆటో తీసుకున్నాను. " అని నిష్ఠ ట్వీట్ చేసింది.


"నా దగ్గర క్యాష్ లేదు కాబట్టి పేటీఎం చేస్తానని ఆటో డ్రైవర్‌కి చెప్పాను. తాను ఉబర్ కోసం డ్రైవ్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. నేను ఆటోలో కూర్చున్నాను. అతను భక్తి సంగీతాన్ని వింటున్నాడు" అని ఆమె చెప్పింది. "నేను నివసించే సెక్టార్‌కు కుడివైపునకు వెళ్లాల్సిన టి పాయింట్‌కి మేము చేరుకున్నాము. కానీ అతను ఎడమవైపుకు తీసుకున్నాడు. మీరు ఎడమవైపుకు వెళ్తున్నారా అని నేను అతనిని అడిగాను. అతను వినలేదు, బదులుగా అతను దేవుని పేరు (నేను చేయను' అని) అరవడం ప్రారంభించాడు. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు కాబట్టి ఇక్కడ మతాన్ని ప్రస్తావించాలని అనుకోవడం లేదు" అని నిష్ఠ ట్వీట్ లో చెప్పుకొచ్చింది.

"నేను బిగ్గరగా అరిచాను - 'భయ్యా, మేరా సెక్టార్ రైట్ మే థా ఆప్ లెఫ్ట్ మీ క్యు లేకే జా రహే హో.'(నేను వెళ్లాల్సిన చోటు కుడి వైపు ఉంది.. అన్నా మీరు ఎందుకు ఎడమ వైపు తీసుకుని వెళ్తున్నారు) చెప్పినా అతను ప్రతిస్పందించలేదు. హై పిచ్‌లో దేవుని పేరును తీసుకుంటూనే ఉన్నాడు. నేను అతని ఎడమ భుజంపై 8-10 సార్లు కొట్టాను, కానీ ఏమీ స్పందించలేదు. నా మదిలో వచ్చిన ఆలోచన ఒక్కటే - బయటకు దూకు," అని అనిపించింది. "స్పీడ్ 35-40, వాడు మరింత స్పీడ్ అయ్యేలోపు బయటకి దూకడం ఒక్కటే ఆప్షన్. తప్పిపోవడం కంటే ఎముకలు విరిగిపోవడమే మేలు అనుకున్నాను. కదులుతున్న ఆటోలోంచి దూకేశాను! ఆ ధైర్యం నాకు ఎలా వచ్చిందో తెలియదు." అని ఆమె ట్వీట్ చేసింది.

గుర్గావ్‌లోని పాలం విహార్‌కు చెందిన జితేందర్ యాదవ్ అనే పోలీసు అధికారి ఆటోరిక్షా డ్రైవర్‌ను కనుగొంటామని చెప్పారు. తాను టెన్షన్ లో ఆటో నంబర్ ను నోట్ చేసుకోలేదని తెలిపింది. పోలీసులు సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.


Next Story