గుజరాత్ లో బయటపడ్డ ఒమిక్రాన్ కేసులు.. విదేశాల నుండి వచ్చిన వాళ్లు ఏమి చేశారంటే..

Gujarat reports first case of Omicron Covid-19 variant. భారత్ లో ఒమిక్రాన్ కేసులు గుర్తిస్తూ వస్తున్నారు. తాజాగా గుజరాత్ లోని జామ్ నగర్ లో

By Medi Samrat  Published on  4 Dec 2021 4:07 PM IST
గుజరాత్ లో బయటపడ్డ ఒమిక్రాన్ కేసులు.. విదేశాల నుండి వచ్చిన వాళ్లు ఏమి చేశారంటే..

భారత్ లో ఒమిక్రాన్ కేసులు గుర్తిస్తూ వస్తున్నారు. తాజాగా గుజరాత్ లోని జామ్ నగర్ లో ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తిని గుర్తించారు. అతడు ఆఫ్రికా దేశం జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చాడు. అతడి నుంచి నమూనాలు సేకరించి పూణే ల్యాబ్ కు పంపారు. అతడికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్ధారణ అయింది. దేశంలో ఇది మూడో ఒమిక్రాన్ కేసు. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే టెస్టులు నిర్వహిస్తున్నారు.

వీరి చిరునామాలు, ఫోన్ నంబర్లను తీసుకుని పంపిస్తున్నారు. వీరి రిపోర్టుల్లో పాజిటివ్ వస్తే వెంటనే వారిని ట్రేస్ చేసి క్వారంటైన్ కు పంపిస్తున్నారు. కొందరు మాత్రం తప్పుడు అడ్రస్, ఫోన్ నంబర్లు ఇస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ల్యాండ్ అయిన 297 మంది ప్రయాణికుల్లో 13 మంది తప్పుడు ఫోన్ నంబర్లు, చిరునామాలు ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేశ్ మోహన్ తెలిపారు. ప్రస్తుతం వీరిని ట్రేస్ చేసే పనిలో ఉన్నామని తెలిపారు. వారిని గుర్తించేందుకు గాను స్థానిక ఇంటెలిజెన్స్ టీమ్ కు వివరాలను అందించామని చెప్పారు. వీరంతా కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని తెలిపారు.


Next Story