ఒకటో తరగతి పుస్తకాలకే రూ. 4000 బిల్లా.. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఇంతా.!

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ గురించి చర్చ జరుగుతూ ఉంది.

By -  Medi Samrat
Published on : 1 March 2026 7:50 PM IST

ఒకటో తరగతి పుస్తకాలకే రూ. 4000 బిల్లా.. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఇంతా.!

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ గురించి చర్చ జరుగుతూ ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన విశాల్ షా అనే వ్యక్తి తన కూతురి ఒకటో తరగతి పుస్తకాల కోసం ఏకంగా రూ. 4000 చెల్లించాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ (X) వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. "నా కూతురు ఇప్పుడు 1వ తరగతికి వెళుతోంది. యూకేజీతో పోలిస్తే స్కూల్ ఫీజులు అమాంతం 35 శాతం పెంచేశారు. పైగా పుస్తకాలు, కనీసం నోట్‌బుక్స్ కూడా స్కూల్‌లోనే కొనాలని కండిషన్ పెట్టారు. మార్కెట్‌లో అయితే ఇవన్నీ డిస్కౌంట్‌కే దొరుకుతాయి కదా?" అని ఆయన ప్రశ్నించాడు.

కేవలం రూ. 80 విలువ చేసే పుస్తకాలను ప్రైవేట్ పబ్లిషర్లతో కుమ్మక్కై రూ. 500కు అమ్ముతున్నారని, ఈ స్కూళ్ల దోపిడీకి అడ్డే లేకుండా పోయిందని, దీనిపై ప్రభుత్వ నిఘా అస్సలు లేదని నెటిజన్లు ఆ పోస్ట్‌కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా స్కూల్లోనే అన్నీ కొనాలనే నిబంధనల వల్ల తల్లిదండ్రులపై పెను భారం పడుతోందన్నారు.

Next Story