ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి నెలా నెలవారీ జీఎస్టీ వసూళ్ల గణాంకాలను విడుదల చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇప్పటి వరకూ ఇది రెండో అత్యధికంగా మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 2022లో వసూలు చేసిన రూ. 1.52 లక్షల కోట్ల కంటే.. ఈ వసూళ్లు 13 శాతం ఎక్కువ అని వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో రూ.1.62 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
అక్టోబర్ 2023లో జిఎస్‌టి ఆదాయం రూ. 1.72 లక్షల కోట్లుగా ఉంది. ఏప్రిల్ 2023 తర్వాత ఇది రెండవ అత్యధికం అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 2023లో అత్యధికంగా రూ. 1.87 లక్షల కోట్ల ఆదాయం జీఎస్టీ వసూళ్ల ద్వారా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు స్థూల నెలవారీ GST వసూళ్లు రూ. 1.66 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 11 శాతం ఎక్కువని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.