7వ ఫ్లోర్ నుండి వివస్త్రగా కిందకు పడిన 24 ఏళ్ల యువతి

Greater Noida girl who fell from the 7th floor naked. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని హై ప్రొఫైల్ సొసైటీకి చెందిన 24 ఏళ్ల యువతి

By Medi Samrat
Published on : 19 Dec 2021 4:58 PM IST

7వ ఫ్లోర్ నుండి వివస్త్రగా కిందకు పడిన 24 ఏళ్ల యువతి

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని హై ప్రొఫైల్ సొసైటీకి చెందిన 24 ఏళ్ల యువతి 7వ అంతస్తు నుండి కిందకు పడిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. యువతి తలకు, మెడకు బలమైన గాయమై కోమాలో ఉంది. ఫ్లాట్‌లోని కిటికీలో నుంచి కింద పడిన సమయంలో యువతి వివస్త్రగా ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.

యువతి పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమ్మాయి. హర్యానాలోని పానిపట్‌లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. ఆమె తన స్నేహితుడిని కలవడానికి డిసెంబర్ 12న గ్రేటర్ నోయిడాకు వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఏడో అంతస్తు నుంచి యువతి ఒక్కసారిగా కింద పడిపోయింది. గాయపడిన యువతిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మత్తులో ఉండటం వల్లే యువతి కిటికీలోంచి కిందపడిందని ప్రాథమిక విచారణలో పోలీసులకు తేలింది.

యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఇంతవరకు ఆమెని కలవడానికి ఎవరూ రాలేదని ఆమె స్నేహితురాలు విచారణలో పోలీసులకు తెలిపింది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆమె తన ఫ్లాట్‌లో నివసించేది. ఘటన జరిగిన రోజు రాత్రి పార్టీ చేసుకున్నారని, అర్ధరాత్రి ఆమె బాత్‌రూమ్‌కి వెళ్లేసమయంలో కిటికీలో నుంచి కిందపడిపోయిందని యువతి స్నేహితుడు పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story