Video : సమోసాలు తీసుకుని రాలేదని భర్తను కొట్టించిన నవ వధువు
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ఒక వింత ఘటనలో, తనకు సమోసాలు తీసుకురాలేదని కొత్తగా పెళ్లైన ఒక మహిళ తన భర్తను కొట్టింది.
By Medi Samrat
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ఒక వింత ఘటనలో, తనకు సమోసాలు తీసుకురాలేదని కొత్తగా పెళ్లైన ఒక మహిళ తన భర్తను కొట్టింది. అది కాస్తా కుటుంబ గొడవగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆగస్టు 29న సంగీత తన భర్త శివమ్‌ను సమోసాలు తీసుకురావాలని కోరింది. శివమ్ తీసుకుని రావడానికి బయలుదేరాడు కానీ మార్గమధ్యంలో డబ్బు పోగొట్టుకుని ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇది తీవ్ర వాదనకు దారితీసింది. అతని భార్య రాత్రి భోజనం చేయడానికి నిరాకరించింది. తరువాత ఆమె బంధువులకు ఫోన్ చేసింది, ఆ బంధువులు వచ్చి అతనిపై దాడి చేశారు. శివం మాట్లాడుతూ.. గొడవ సమయంలో అతని తల్లిని కూడా కొట్టినట్లు తెలిపారు. తరువాత మాజీ ప్రధాన్ అవధేష్ శర్మ ఇంట్లో పంచాయతీ కోసం సమావేశమైనప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ కూడా, సంగీత బంధువులు శివం కుటుంబంపై బెల్టులతో దాడి చేసి, అనేక మందిని గాయపరిచారు.
यूपी के पीलीभीत में समोसा नहीं खिलाने पर एक पति की जान सांसत में आ गई। बीवी ने पंचायत बुलाई। फिर अपने परिजनों के साथ मिलकर पति और उसकी मां की पिटाई कर दी। #pilibhit #samosa #upnews pic.twitter.com/7kebdJFEFD
— Pawan Kumar Sharma (@pawanks1997) September 4, 2025
ఫిర్యాదు మేరకు నిందితులైన బంధువులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. “నా భార్య సమోసాలు తీసుకురావాలని అడిగింది, కానీ నేను తీసుకురాలేకపోయాను. పంచాయితీ జరిగింది, కానీ సమస్యను పరిష్కరించడానికి బదులుగా, ఆమె కుటుంబ సభ్యులు నన్ను, నా కుటుంబాన్ని కొట్టారు. మేము పోలీసులకు ఫిర్యాదు చేసాము” అని శివం వాపోయారు.