వచ్చే వారం ఘ‌నంగా యోగి ప్రమాణ స్వీకారోత్సవం

Grand swearing-in ceremony for Yogi next week. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని

By Medi Samrat  Published on  18 March 2022 3:37 PM IST
వచ్చే వారం ఘ‌నంగా యోగి ప్రమాణ స్వీకారోత్సవం

వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వచ్చే వారం ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వేలాది మంది ఆహ్వానితుల న‌డుమ‌ ఏకనా స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. కార్య‌క్ర‌మం నిమిత్తం బీజేపీ ఆహ్వానితుల జాబితాను సిద్ధం చేస్తోంది. అలాగే.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌నున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించినందున వారిని ఆహ్వానిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే స్టేడియంలో దాదాపు 200 మంది వీవీఐపీలకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కార్య‌క్ర‌మానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్ షా తదితరులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్షాలతోపాటు కొందరు ప్రముఖ నేతలు హాజ‌రుకానున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్‌ శాసనసభలో 255 స్థానాలను గెలుచుకుని బీజేపీ వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది.










Next Story