మే, జూన్‌ నెలలో ఉచితంగా 5 కిలోల ఆహారధాన్యాలు

Govt to provide free food grains to poor under PM Garib Kalyan Ann Yojana in May, June. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశంలో ఉపాధి

By Medi Samrat  Published on  23 April 2021 3:54 PM GMT
మే, జూన్‌ నెలలో ఉచితంగా 5 కిలోల ఆహారధాన్యాలు

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశంలో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి అనేక మంది సొంత రాష్ట్రాలకు వలస పోతున్నారు. చాలా నగరాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం కింద పేదలకు తీపికబురు అందించింది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్క లబ్దిదారునికి మే, జూన్‌ నెలలో 5 కిలోల చొప్పున ఆహర ధాన్యాలను పంపిణీ చేయనున్నారు. దాదాపు 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఆహర ధాన్యాల కోసం కేంద్రం తొలిదశలో రూ. 26 వేల కోట్లను ఖర్చుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న్ యోజన కింద వచ్చే మే, జూన్ నెలల్లో పేదలకు ఆహార ధాన్యాలు ఉచితంగా అందించనున్నారు. కుటుంబంలో ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు ఇవ్వనున్నారు. దేశంలోని మొత్తం 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూల కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. వలస కార్మికులు నగరాలను వదిలిపెట్టి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. పేదలను ఆదుకునే చర్యల్లో భాగంగా ఉచితంగా రేషన్ అందించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


Next Story