బూస్టర్ డోస్ వ్యవధిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత 9 నెలలకు బూస్టర్ డోస్‌ను వేస్తున్నారు. తాజాగా ఈ వ్యవధిని 6 నెలలకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్మూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫారసుల మేరకు కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రికాషనరీ డోస్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం ప్రికాషనరీ డోస్‌లను దేశవ్యాప్తంగా ప్రైవేట్ కేంద్రాల్లోనే వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ వ్యవధిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కేంద్రాలకు మరింత మేర వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజరీ జారీ చేసింది. కరోనా కారణంగా మానసిక రుగ్మతలు అనూహ్యంగా పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ(WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోందని హెచ్చరించింది. ప్రపంచ మానసిక ఆరోగ్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమీక్షలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.