వాహనదారులకు కేంద్రం శుభవార్త.. ఫాస్టాగ్ గడువు పొడిగింపు
Govt extends deadline for use of FASTag till February 15. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 1
By Medi Samrat Published on 31 Dec 2020 10:00 AM GMTవాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి అని చెప్పిన కేంద్రం.. తాజాగా ఆ గడువును మరో 45 రోజులు పొడిగించింది. అంతేకాదు.. ఫిబ్రవరి 15 తరువాత ప్రతి వాహనానికి తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండి తీరాలని స్ఫష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ ద్వారా 75-80 లావాదేవీలు జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టోల్ గేట్ ల వద్ద చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. ఇక పండగ సమయంలో టోల్ గేట్ ల వద్ద రద్దీ మరింత అధికంగా ఉండటంతో కేంద్రం దీనిని సవాల్ గా తీసుకుంది. ఫాస్టాగ్ లను ఏర్పాటు చేసింది. అయితే.. గతంలో అనేకమార్లు తుది గడువును నిర్ణయించినా అన్ని వాహనాలకు సాధ్యం కాకాపోవడంతో గడువు పెంచుతూ వస్తోంది.
టోల్ ప్లాజాల వద్ద జనవరి 1 నుంచి క్యాష్ లైన్లను తొలగించి అన్ని ఫాస్టాగ్ లైన్లను మాత్రమే ఉంచాలని గతంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఫాస్టాగ్ లేని వారికి ప్రిపేయిడ్ కార్డ్‌లను జారీ చేయాలని నిర్ణయించింది. టోల్ ప్లాజాల వద్ద వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోకుండా ఉండేందుకు ప్రిపేయిడ్ టచ్ అండ్ గో విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ లేకపోతే పెనాల్టీగా రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సిందేనని నిర్ణయించింది. అయితే.. ఇంకా చాలా మంది ఫాస్టాగ్‌ను తీసుకోకపోవడంతో.. మరో సారి కేంద్రం గడువును పొడిగించింది.