భారత దేశంలో కరోనా వ్యాక్సిన్ వికటించి తొలి మరణం సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి.. ఓ 68 ఏళ్ల వృద్ధుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనఫిలాక్సిస్‌తో చనిపోయినట్లు నిర్థారించింది. చనిపోయిన ఆ వృద్ధుడు.. మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్నాడని.. వ్యాక్సినేషన్ తర్వాత కలిగే అనఫిలాక్సిస్ వల్ల చనిపోయిన తొలి వ్యక్తి వృద్ధుడేనని.. కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వ ప్యానెల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.
ఇదిలావుంటే.. అనఫిలాక్సిస్ అంటే ఒక తీవ్రమైన ఎలర్జీ. మరో ఇద్దరు వ్యక్తులు కూడా వ్యాక్సిన్ తర్వాత అనఫిలాక్సిస్ బారినపడినప్పటికీ.. వాళ్లు చికిత్స తర్వాత కోలుకున్నారని ప్యానెల్ పేర్కొంది. వ్యాక్సిన్ సంబంధిత రియాక్షన్లు ముందుగా ఊహించినవే అని ప్యానెల్ తెలిపింది. అయితే.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించిన 31 మందిలో కలిగిన తీవ్ర దుష్ప్రభావాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది.