శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By -  Medi Samrat
Published on : 28 Nov 2025 8:30 PM IST

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణాల్లో ఇరుముడిని హ్యాండ్ లగేజ్ గా తమతో పాటే క్యాబిన్‌లోకి తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు ఈ నిర్ణయం ఊరట కల్పించనుంది.

ఇప్పటివరకు ఉన్న కఠినమైన విమానయాన నిబంధనల ప్రకారం, ఇరుముడిలోని కొబ్బరికాయ కారణంగా దానిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీలో ఉంచాల్సి వచ్చేది. భక్తుల విశ్వాసాలను, మనోభావాలను గౌరవిస్తూ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ, సంబంధిత భద్రతా సంస్థలతో చర్చలు జరిపి ఈ ప్రత్యేక మినహాయింపు తీసుకుని వచ్చారు. ఈ ప్రత్యేక వెసులుబాటు నవంబర్ 28 నుంచి 2026 జనవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే భక్తులు విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బందికి సంపూర్ణంగా సహకరించాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియలో అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Next Story