5 ల‌క్ష‌ల ఏకే-203 రైఫిళ్ల త‌యారీ.. కేంద్రం ప్రభుత్వం ఆమోదం

Govt allows to manufacture over 5 lakh AK-203 assault rifles. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో అభివృద్ధిని పెంపొందించేందుకు కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on  4 Dec 2021 7:07 AM GMT
5 ల‌క్ష‌ల ఏకే-203 రైఫిళ్ల త‌యారీ..  కేంద్రం ప్రభుత్వం ఆమోదం

దేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో అభివృద్ధిని పెంపొందించేందుకు కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలోని కోర్వాలో ఐదు లక్షలకు పైగా ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల ఉత్పత్తికి కేంద్రం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. రష్యా భాగస్వామ్యంతో ఈ రైఫిళ్లను తయారు చేయనున్నారు. ఇది గ్లోబల్ నుండి మేక్ ఇన్ ఇండియా వరకు రక్షణ కొనుగోలులో నానాటికీ పెరుగుతున్న నమూనా మార్పును ప్రతిబింబించనుంది. రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య లోతైన భాగస్వామ్యాన్ని ఇది సూచిస్తుందని ప్రభుత్వవర్గాలు చెప్పాయి. 7.62 X 39mm క్యాలిబర్ AK-203 రైఫిల్స్‌ను మూడు దశాబ్దాల క్రితమే ప్రవేశపెట్టారు. అయితే ఇన్-సర్వీస్ INSASలొ రైఫిళ్లను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

AK-203 రైఫిళ్లు తేలికైనవి, దృఢమైనవి. 300 మీటర్ల ప్రభావవంతమైన పరిధి గల సామర్థ్యం ఈ రైఫిళ్లకు ఉంటుంది. ఆధునిక అసాల్ట్ రైఫిల్‌లను ఉపయోగించడానికి సులభమైనవి. ఈ అసాల్ట్ రైఫిల్స్ యొక్క సాంకేతికత సైనికుల పోరాట సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. సైనికులు అత్యంత ఖచ్చితత్వంతో ఈ రైఫిళ్లను వాడవచ్చు. AK-203 అస్సాల్ట్ రైఫిల్స్ తిరుగుబాటు/ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో భారత సైన్యం యొక్క కార్యాచరణ ప్రభావాన్ని మెరుగుపరుస్తాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రత్యేక ప్రయోజన జాయింట్ వెంచర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ రక్షణ పరిశ్రమలకు ముడి పదార్థాలు, భాగాల సరఫరా కోసం వ్యాపార అవకాశాలను అందిస్తుంది. ఇది కొత్త ఉపాధి అవకాశాల ఉత్పత్తికి దారి తీస్తుంది.

Next Story