రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి 5000 రూపాయలు బాహుమానం

Good Samaritans to be paid 5k for rushing road accident victims to hospital. రోడ్డు ప్రమాదాలు సంభవించిన వెంటనే స్పందించి బాధితులకు సాయం చేసినవారికి 5,000

By Medi Samrat  Published on  5 Oct 2021 11:22 AM GMT
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి 5000 రూపాయలు బాహుమానం

రోడ్డు ప్రమాదాలు సంభవించిన వెంటనే స్పందించి బాధితులకు సాయం చేసినవారికి 5,000 రూపాయలు పారితోషికాన్ని అందించే పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ తెలిపింది. తొలి గంటలో బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు. అక్టోబరు 15 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.లక్ష చొప్పున రివార్డును అందిస్తారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ లేఖ రాసింది. అక్టోబరు 15, 2021 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది. ఒకవేళ, ఒక వ్యక్తి ఒకరు కంటే ఎక్కువ మంది ప్రమాద బాధితులను అసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడితే ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా విభాగాలకు రూ.5 లక్షలు చొప్పున నిధులు అందజేయనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రమాద బాధితుల ప్రాణాలను రక్షించే వ్యక్తికి ఏడాదిలో గరిష్ఠంగా ఐదుసార్లు నగదు బహుమతి అందజేస్తారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

అక్టోబరు 15, 2021 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా విభాగాలకు రూ.5 లక్షలు చొప్పున నిధులు అందజేయనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మార్గదర్శకాల్లో వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి నగదు బహుమతులు, ధ్రువపత్రాల ద్వారా సాధారణ ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.1 లక్ష చొప్పున అందిస్తారు. ఈ పథకంలో ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే, ఆ వివరాలను వైద్యులతో ధ్రువీకరించుకున్న అనంతరం పోలీసులు ఆ వ్యక్తికి ఓ రసీదు ఇస్తారు. ఆ రసీదు కాపీని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఓ కమిటీకి పోలీసులే పంపిస్తారు. రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా నేరుగా ఆసుపత్రికి తరలిస్తే, వారి పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కేంద్రం తాజా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
Next Story
Share it