థియేటర్ల యజమానులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. వినోద పన్నును తగ్గించాలని, సినిమా హాళ్లలో క్రికెట్ ఇతర కార్యక్రమాలను ప్రదర్శించడానికి అనుమతించాలని కోరారు. బాక్సాఫీస్ పనితీరు తగ్గడం, సినిమాల విజయాల రేటు తగ్గడంతో థియేటర్ల నిర్వహణ మరింత కష్టతరం అవుతోంది.
దీంతో తమిళనాడు ప్రభుత్వం స్థానిక సంస్థల వినోద పన్నును 8% నుండి 4%కి తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్, ఇతర ప్రధాన క్రికెట్ మ్యాచ్‌లతో సహా లైవ్ స్పోర్ట్స్ ను థియేటర్లలో ప్రదర్శించడానికి అనుమతి మంజూరు చేయనుంది. ఇది మరింత ఊరటనిచ్చే అంశం. ప్రత్యామ్నాయ ఆదాయాన్ని థియేటర్లకు అందించనుంది. రెండు నిర్ణయాలకు సంబంధించి అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు (జిఓ) త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ విధాన మార్పులు అమలు చేసిన తర్వాత, థియేటర్ పరిశ్రమకు అవసరమైన మద్దతును అందుతుంది.