కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ప్రముఖ నాయకుడు గులాం నబీ ఆజాద్ జమ్మూలో జరిగిన బహిరంగ సభలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తాను స్థాపించబోయే పార్టీ పూర్తిగా రాష్ట్ర హోదా, భూమి హక్కు, స్థానిక నివసించే వారికి ఉపాధిని పునరుద్ధరించడంపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో తన రాజకీయ పార్టీ మొదటి యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గులాం నబీ ఆజాద్ తెలిపారు.
"పూర్తి రాష్ట్ర హోదా, భూమిపై హక్కు, స్థానిక నివాసులకు ఉపాధిని పునరుద్ధరించడంపై నా పార్టీ దృష్టి పెడుతుంది" అని ఆజాద్ చెప్పారు. తన రాజకీయ పార్టీకి పేరును ఇంకా నిర్ణయించలేదని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రజలే పార్టీకి పేరు, జెండాను నిర్ణయిస్తారు. అందరికీ అర్థమయ్యేలా నా పార్టీకి హిందుస్థానీ పేరు పెడతాను. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న ఆయన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ.. గత వారం అఖిలపక్ష పదవికి రాజీనామా చేసిన ఆజాద్, "కొందరు మమ్మల్ని (నన్ను, పార్టీని విడిచిపెట్టిన నా మద్దతుదారుల) పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారి పరిధి కంప్యూటర్ ట్వీట్‌లకే పరిమితమైందని అన్నారు. "కాంగ్రెస్ మా రక్తంతో తయారైంది, కంప్యూటర్లతో కాదు, ట్విట్టర్ ద్వారా కాదని వ్యాఖ్యానించారు.