కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. గులాం నబీ అజాద్ రాజీనామా

Ghulam Nabi Azad resigns from all positions including primary membership of Congress Party. సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు

By అంజి  Published on  26 Aug 2022 6:46 AM GMT
కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. గులాం నబీ అజాద్ రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి మరో బిగ్ షాక్‌ తగిలింది. ఇటీవల పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్‌ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ తాత్కలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి గులాంనబీ ఆజాద్‌ లెటర్‌ రాశారు. కొన్ని రోజులుగా పార్టీ అధిష్ఠానంపై ఆజాద్‌ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ విధానాలు, అంతర్గత వ్యవహారాల గురించి పలుమార్లు బహిరంగం విమర్శలు చేశారు.

తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును కూడా ఆజాద్‌ తప్పుబట్టారు. పార్టీలో రాహుల్ తీరును తప్పుబడుతూ లెటర్‌లో వివరించారు. రాహుల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైందన్నారు. పార్టీలో ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని, సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రాహుల్‌ గాంధీ అత్యంత అసమర్థుడని పేర్కొన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకోవడం బాధేస్తుందంటూ ఆజాద్ పేర్కొన్నారు. తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ మొత్తం ఐదు పేజీల లేఖను సోనియాకు గులాం నబీ ఆజాద్‌ పంపించారు.

లేఖలో.. కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు చేసేందుకు గతంలో మేధోమథనం నిర్వహించారని, అందులో తీసుకున్న అంశాలను మార్పులు చేయలేదని ఆజాద్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా చర్యలు తీసుకోలేదన్నారు.



Next Story