కేంద్రం కీలక నిర్ణయం.. ఉచితంగా ఫాస్టాగ్స్ పంపిణీ
Get Free FASTag at Toll Plazas till March 1st. దేశంలోని టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్
By Medi Samrat Published on 20 Feb 2021 11:31 AM ISTదేశంలోని టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్‌యంలో కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఖచ్చితంగా ఉండాలని ఫిబ్రవరి 15 వరకు కేంద్ర గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే ఫాస్టాగ్ కొనుగోల్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. కేవలం రెండు రోజుల్లోనే 2.5 లక్షల ఫాస్టాగ్ అమ్ముడుపోయాయి.
ఇదిలా ఉంటే తాజాగా వాహనదారులకు శుభవార్త చెబుతూ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాలంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కానీ దీన్ని మార్చి 1వరకు ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కార్డులో డబ్బులు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో భాగంగా దేశంలోని 770 టోల్‌ప్లాజాల వద్ద ఉచితంగా ఫాస్టాగ్‌ను అందించనున్నారు. ఇక ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ తేదీని ప్రకటించిన తొలి రెండు రోజుల్లోనే 87% వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు జరిపాయని కేంద్ర రవాణా శాఖ తెలిపింది.
వంద టోల్ ప్లాజాల దగ్గర 90 శాతం వరకు వాహనాలు ఫాస్టాగ్‌తో వెళ్లాయని కేంద్రం తెలిపింది. అలాగే మైఫాస్టాగ్ యాప్‌లో పలు కొత్త ఫీచర్లను జోడిస్తూ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక మైఫాస్టాగ్ యాప్‌లో 'చెక్ బ్యాలెన్స్ స్టాటస్' అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందన్న విషయం వినియోగదారుడు సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు.