ప్రియుడి ప్రేమ మాటలు నమ్మి.. లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తి.. ఆ తర్వాత

Gender reassignment surgery for love in maharashtra . ప్రేమ కోసం ప్రియుడి మాటలు నమ్మి లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి మోసపోయాడు. ఈ ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో

By అంజి  Published on  14 Nov 2021 8:49 AM IST
ప్రియుడి ప్రేమ మాటలు నమ్మి.. లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తి.. ఆ తర్వాత

ప్రేమ కోసం ప్రియుడి మాటలు నమ్మి లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి మోసపోయాడు. ఈ ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. పుర్‌ఖాన్‌ అనే వ్యక్తిని ముంబైకి చెందిన జమాల్‌ షేక్‌ (31) అనే వ్యక్తి ప్రేమించాడు. జమాల్‌ను గాఢంగా ప్రేమిస్తున్నట్లు ఫుర్‌ఖాన్‌ నటించాడు. అతడిని లింగ మార్పిడి చేసుకుంటే ఇంకా బాగా చూసుకుంటానని చెప్పాడు. దీంతో ప్రియుడి ప్రేమ మోసపు మాటలు నమ్మిన జమాల్‌ లింగ మార్పిడి చేసుకున్నాడు. ఆ తర్వాత శిల్పగా మారాడు. 16 సంవత్సరాల కిందట జమాల్‌ కోల్‌కతా నుండి ముంబైకి వచ్చి స్థిరపడ్డాడు.

సంవత్సరం కిందట జమాల్‌ ఫుర్‌ఖాన్‌తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలోనే లింగ మార్పిడి చేసుకోవాలని ఫుర్‌ఖాన్‌ జమాల్‌ను నమ్మించాడు. ఆ తర్వాత 2 లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నాడు. అంతా జరిగాక ఫుర్‌ఖాన్‌ ఢిల్లీకి పారిపోయాడని, తనను మోసం చేశాడని శిల్పా ఆవేదన వ్యక్తం చేసింది. అతడికి చాలా సార్లు డబ్బులు ఇచ్చినట్లు తెలిపింది. ఫుర్‌ఖాన్‌కు ఇంతకుముందే పెళ్లి అయ్యింది. అయినా కూడా తనను లోతుగా ప్రేమిస్తున్నానని, బాగా చూసుకుంటానని చెప్పడంతో మోసం పోయానని శిల్పా చెప్పింది. తల్లిదండ్రులు కూడా తనను దగ్గరకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం పోలీసులను ఆశ్రయించానని.. పోలీసులు కేసు నమోదు చేయడం లేదని శిల్పా (జమాల్‌) బాధపడుతూ చెప్పింది.

Next Story