మహారాష్ట్రలో గ్యాస్ లీక్.. పెను ప్రమాదం తప్పింది

Gas leak in Badlapur triggers panic. మహారాష్ట్రలోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు

By Medi Samrat  Published on  4 Jun 2021 6:08 AM GMT
మహారాష్ట్రలో గ్యాస్ లీక్.. పెను ప్రమాదం తప్పింది

మహారాష్ట్రలోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్లు తెగ టెన్షన్ పడ్డారు. కెమికల్ ఫ్యాక్టరీకి మూడు కిలోమీటర్ల దూరం వరకూ ఉన్న ప్రజలు గాలి పీల్చడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. కళ్లు మండుతున్నట్లుగా కూడా ఇబ్బందులు వారికి మొదలయ్యాయి. షిర్గావో ఎంఐడిసి ప్రాంతంలోని నోబెల్ ఇంటర్మీడియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది.

వెంటనే ప్రజలందరికీ గాలి పీల్చడంలో ఇబ్బందులు, కళ్లు మండడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. గురువారం రాత్రి 10:22 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గంట సమయంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చామని అధికారులు తెలిపారు. 10:22 సమయంలో గ్యాస్ లీక్ కు సంబంధించిన సమాచారం వచ్చిందని.. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి.. 11:24 కల్లా లీకేజీని అరికట్టారని అధికారులు మీడియాకు తెలిపారు. ఎవరి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదని అన్నారు. కొందరు మాత్రం ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారని అధికారులు తెలిపారు.


Next Story