పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు..
Gas Cylinder Price Hike. కరోనాతో సామాన్యుడి బతుకు మరింత దయనీయంగా మారింది. అయినా ప్రభుత్వాలు కనీస కనికరం చూపట్లేదు.
By Medi Samrat Published on 1 July 2021 12:09 PM ISTకరోనాతో సామాన్యుడి బతుకు మరింత దయనీయంగా మారింది. అయినా ప్రభుత్వాలు, చమురు సంస్థలు కనీస కనికరం చూపట్లేదు. ఓ పక్క రోజురోజుకి ఇంధన ధరలు చుక్కలు చూపిస్తుండగా.. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది సరిపోదన్నట్టు.. ఇప్పుడు గ్యాస్ బండ కూడా మధ్యతరగతి జనాల పాలిట గుదిబండలా మారబోతుంది. అయితే.. కొద్దిరోజులుగా వంటగ్యాస్ ధరలు పెరుగుతుండగా.. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. ఇంటి అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌పై రూ. 25, కమర్శియల్ సిలిండర్‌పై రూ. 84ను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపాయి.
ప్రధాన నగరాల్లో సిలిండర్ ధరలు..
ఢిల్లీలో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 834.50
ముంబయిలో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 850.50
కోల్‌కతాలో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 850.50
చెన్నైలో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 850.50
హైదరాబాద్‌లో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.887
ఇదిలావుంటే.. గడిచిన ఆరు నెలల్లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 140 పెరిగింది. మొదట ఫిబ్రవరి 4న సిలిండర్ ధరను రూ. 25 పెంచారు. అనంతరం ఫిబ్రవరి 15న రూ. 50, అదె నెల 25న మరో రూ. 25 పెంచారు. ఇక్క పిబ్రవరి నెలలోనే గ్యాస్ ధర రూ. 100 పెరిగింది. ఇక మార్చి 1న మరో రూ.25 పెంచారు.