మ‌రోమారు పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌.. ఈ సారి ఎంతంటే..

Gas Cylinder Price Hike. దేశంలో వంట గ్యాస్ ధర మ‌రోసారి పెరిగింది.

By Medi Samrat
Published on : 1 March 2021 10:02 AM IST

Gas Cylinder Price Hike

దేశంలో వంట గ్యాస్ ధర మ‌రోసారి పెరిగింది. నిన్న‌టివ‌ర‌కూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వచ్చిన చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్‌పై రూ.25 పెంచాయి. పెరిగిన ధరలు నేటినుండే అమల్లోకి రానున్న‌ట్లు తెలిపాయి. దీంతో ఢిల్లీలో సిలిండ‌ర్‌‌ ధర రూ.819కు చేరింది. ఇప్ప‌టికే ఫిబ్రవరి నెలలో మూడుసార్లు పెరిగిన సిలిండ‌ర్ ధ‌ర‌.. తాజాగా నేటినుండి మ‌ళ్లీ పెర‌గ‌డం గమనార్హం.

సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు నెలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ఒక్క ఫిబ్రవరి నెలలో నెల‌లో మూడుసార్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లను అనుగుణంగా ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరను మారుస్తూ వస్తాయి. మొద‌ట‌గా పిబ్ర‌వ‌రి 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా.. రెండ‌వ‌సారి 15న తేదీన మరో రూ.50లు పెంచాయి. మూడోసారి పిబ్ర‌వ‌రి 25న రూ.25 మ‌రోమారు పెంచాయి. ఇలా ఒక్క‌నెల‌లోనే మూడుసార్లు పెంచి సామాన్యుడికి సిలిండర్‌పై రూ.100 అద‌నపు భారం చేశాయి‌. గత ఏడాది డిసెంబర్‌లోనూ చ‌మురు కంపెనీలు సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను రెండు సార్లు పెంచాయి. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదిలావుంటే.. దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రజల బాధలతో సంబంధం లేకుండా.. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నాయి. వారంలో ఒకట్రెండు రోజులు తప్ప.. మిగతా రోజుల్లో ధరలు పెరుగుతూనే ఉన్నాయి.




Next Story