సీసీటీవీ కెమెరాలను అమరుస్తున్న వెల్లుల్లి రైతులు

దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.! మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో వెల్లుల్లి రైతులు ఇప్పుడు తమ పొలాల్లో CCTV కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు

By Medi Samrat  Published on  18 Feb 2024 10:44 AM GMT
సీసీటీవీ కెమెరాలను అమరుస్తున్న వెల్లుల్లి రైతులు

దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.! మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో వెల్లుల్లి రైతులు ఇప్పుడు తమ పొలాల్లో CCTV కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్‌లో వెల్లుల్లి ధర విపరీతంగా పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో 400 నుంచి 500 రూపాయలకు చేరుకుంది. వెల్లుల్లి ధరల పెరుగుదలతో, బద్నూర్‌లోని రైతులు పంటలను రక్షించుకోవడానికి పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దొంగతనాలు జరగకుండా.. రైతులు తమ పొలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో టమాటా ధరలు భారీగా పెరిగిన సమయంలో కూడా దొంగలు రైతుల మీద పడ్డారు. పలువురిపై దాడి చేసి పంటలను కూడా దోచుకుని వెళ్లారు.

ఇక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లుల్లి ధర సాధారణంగా కిలో 80 రూపాయలు ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో గణనీయంగా పెరిగి, కిలో 300 రూపాయలు దాటింది. దీంతో రైతులు భారీ లాభాలను పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రేటుకు వెల్లుల్లి అమ్ముతున్నారు. తెలంగాణలో 500 రూపాయ‌లు ఉండ‌గా.. ఏపీలో 450రూపాయ‌ల వ‌ర‌కు ప‌లుకుతున్నాయి. రాజ‌స్థాన్ స‌హా ఉత్త‌రాది రాష్ట్రాల్లో 600 రూపాయ‌ల వ‌ర‌కు వెల్లుల్లిధ‌ర‌లు ప‌లుకుతున్నాయి.

Next Story