తిరంగా యాత్ర‌లో అప‌శృతి.. దూసుకొచ్చిన ఆవు.. గాయ‌ప‌డిన మాజీ ఉప ముఖ్య‌మంత్రి

Galloping Cow Hits BJP Leader During Tiranga Yatra.గుజరాత్‌లోని మెహ్‌సనాలో నిర్వ‌హించిన 'హర్ ఘర్ తిరంగా యాత్ర‌లో అప‌శృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2022 7:35 AM IST
తిరంగా యాత్ర‌లో అప‌శృతి.. దూసుకొచ్చిన ఆవు.. గాయ‌ప‌డిన మాజీ ఉప ముఖ్య‌మంత్రి

గుజరాత్‌లోని మెహ్‌సనాలో నిర్వ‌హించిన 'హర్ ఘర్ తిరంగా యాత్ర‌లో అప‌శృతి చోటు చేసుకుంది. యాత్ర‌లో పాల్గొన్న నేత‌ల‌పైకి ఓ ఆవు దూసుకువ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో గుజ‌రాత్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్ గాయ‌ప‌డ్డారు. వెంట‌నే ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఎడ‌మ కాలికి ఫ్రాక్చ‌ర్ అయింది.

దేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూరి అవుతున్న వేళ ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మం కింద హ‌ర్ ఘ‌ర్ తిరంగా ఉత్స‌వంలో దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో గుజ‌రాత్ రాష్ట్రంలోని మెహ్‌సనాలో తిరంగా యాత్ర నిర్వ‌హించారు. ఈ ర్యాలీకి మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ సార‌థ్యం వ‌హించారు. దాదాపు రెండు వేల మందికిపైగా ఈ యాత్ర‌లో పాల్గొన్నారు. ర్యాలీ ఓ కూర‌గాయ‌ల మార్కెట్ వ‌ద్ద‌కు చేరుకోగా..జనసందోహానికి జడిసిన ఓ ఆవు ఆ గుంపులోకి దూసుకువ‌చ్చింది. నితిన్ ప‌టేల్ స‌హా కొంద‌రు కింద‌ప‌డిపోయారు. వెంట‌నే ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాలికి ఫ్రాక్చ‌ర్ అయింద‌ని కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story