వరుస చమురు ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. రోజురోజుకు ధరల పెరుగుదలతో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నాలుగు రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా మళ్లీ వాహనదారులకు షాక్ ఇచ్చాయి. లీటర్ పెట్రోల్‌పై 25పైసలు పెంచగా, డీజిల్‌పై 17 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్ - పెట్రోల్ రూ.94.79, డీజిల్ రూ.88.86
వరంగల్ - పెట్రోల్ రూ. 94.37, డీజిల్ రూ. 88.45
కరీంనగర్ - పెట్రోల్ 94.74, డీజిల్ రూ. 88.62
విజయవాడ - పెట్రోల్ రూ. 97.2, డీజిల్ 90.72
విశాఖపట్నం - పెట్రోల్ రూ. 96.27, డీజిల్ రూ. 89.82
కృష్ణా - పెట్రోల్ రూ. 97.21, డీజిల్ రూ. 90.67
ఢిల్లీ - పెట్రోల్ రూ. 91.17, డీజిల్ రూ. 81.47
ముంబై - పెట్రోల్ రూ. 97.57, డీజిల్ రూ. 88.60
పుణెలో - పెట్రోల్ రూ. 97.37, డీజిల్ 87.06
చెన్నై - పెట్రోల్ రూ. 93.11, డీజిల్ రూ. 86.45
కలకత్తా - పెట్రోల్ రూ. 91.35, డీజిల్ రూ. 84.35