వాహనదారులకు చమురు సంస్థలు రోజురోజుకు షాకిస్తున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో బెంబేలెత్తుతున్న వాహనదారులకు బుధవారం కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోయినా..కాస్త నిలకడగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ధరల్లో హెచ్చు, తగ్గులు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బుధవారం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలో ప్రముఖ నగరాల్లో ధరలు..
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.91.17, డీజిల్ ధర రూ.81.47
ముంబైలో పెట్రోల్ ధర రూ.97.57, డీజిల్ రూ.88.60
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.91.35, డీజిల్ రూ.84.35
చెన్నైలో పెట్రోల్ రూ.93.19, డీజిల్ రూ.86.53
బెంగళూరులో పెట్రోల్ ధర రూ.94.22, డీజిల్ ధర రూ.86.37
తెలుగు రాష్ట్రాలలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 94.79, డీజిల్ రూ.88.86
వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.94.37, డీజిల్ రూ.88.45
విజయవాడలో పెట్రోల్ ధర రూ.97.39, డీజిల్ రూ.90.91
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.96.41, డీజిల్ రూ.89