దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. గత ఐదు రోజులుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా ఐదో రోజు శనివారం లీటర్ పెట్రోల్‌పై 38 పైసలు, లీటర్ డీజిల్‌పై 30 పైసలు పెంచాయి చమురు సంస్థలు.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.91.96 ఉండగా, డీజిల్ 85.89 పైసలు ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.44 ఉండగా, డీజిల్ రూ.78.74 పైసలు ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.94.93 ఉండగా, డీజిల్ రూ.85.70కి చేరింది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.91.40 ఉండగా, డీజిల్ ధర రూ.83.47. ఇక చెన్నైలో పెట్రోల్ ధర రూ.90.70 ఉండగా, డీజిల్ రూ.83.86 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.89.73 ఉండగా, డీజిల్ రూ.82.33 ఉంది.
కాగా, ప్రమాణాల ఆధారంగా చమురు సంస్థలు ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. అయితే డీలర్లు పెట్రోల్ పంపులను నడుపుతున్న వ్యక్తులు పన్నులు, వారి స్వంత మార్జిన్లను వినియోగదారులకు జోడించిన తర్వాత వారు రిటైల్ ధరలకు వినియోగదారులకు విక్రయిస్తారు.