భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 5 నుంచి 15 వరకు సందర్శకులందరికీ ఉచితంగా పలు స్మారక చిహ్నాల ప్రాంతాలలోకి ఎంట్రీ లభించనుంది. టిక్కెట్టు తీసుకొని ఎంట్రీకి అవకాశం ఉన్న అన్ని కేంద్ర రక్షిత స్మారక ప్రాంతాలకు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 తేదీలలో ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తామని భారత పురావస్తు శాఖ(ASI) బుధవారం తెలిపింది.
ఏ సందర్శకుడి (స్వదేశీ లేదా విదేశీయులు) నుండి ఎటువంటి ప్రవేశ రుసుము వసూలు చేయబడదని ASI తెలిపింది. ASI పరిధి లోని అన్ని మ్యూజియంలలో కూడా సందర్శకులందరికీ ఉచితంగా ప్రవేశం కల్పిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయం హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోట, చార్మినార్.. ఇలా ASI కింద కేంద్ర ప్రభుత్వంచే రక్షించబడిన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టిక్కెట్టు పొందిన స్మారక చిహ్నాలకు వర్తిస్తుంది.