నాలుగో వేవ్ వచ్చేది అప్పుడేనట..!
Fourth wave of Covid-19 in India from June, to last for 4 months. కరోనావైరస్ మహమ్మారి యొక్క మూడవ వేవ్ భారతదేశంలో క్షీణిస్తున్న ధోరణిలో ఉండడంతో..
By Medi Samrat
కరోనావైరస్ మహమ్మారి యొక్క మూడవ వేవ్ భారతదేశంలో క్షీణిస్తున్న ధోరణిలో ఉండడంతో.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IIT-K) పరిశోధకులు జూన్ 22 నాటికి దేశంలో నాలుగో వేవ్ ఏర్పడవచ్చని అంచనా వేశారు. IIT-K నిపుణులు నిర్వహించిన పరిశోధన ప్రకారం, జూన్ మధ్యలో లేదా ఆ నెల చివరి భాగంలో భారతదేశం నాలుగో కోవిడ్-19 వేవ్‌ను చూసే అవకాశం ఉంది. నాలుగో వేవ్ 4 నెలల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఫోర్త్ వేవ్ తీవ్రత కొత్త వేరియంట్ ల ఆవిర్భావం, టీకా స్థితి, బూస్టర్ డోస్ ల నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. జింబాబ్వేలోని డేటా ఆధారంగా గాస్సియన్ పంపిణీ మిశ్రమాన్ని ఉపయోగించి IIT కాన్పూర్ మ్యాథమెటిక్ విభాగానికి చెందిన సబర పర్షద్ రాజేష్‌భాయ్, సుభ్రా శంకర్ ధర్, శలభ్ ఈ పరిశోధన చేశారు. ఈ IIT-K అధ్యయనం MedRxivలో ప్రీ-ప్రింట్‌గా ప్రచురించబడింది. ఇంకా పీర్-రివ్యూ చేయబడలేదు.
నాలుగో వేవ్ దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుందని, ఆగస్టు 15 నుండి 31 వరకు కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మూడు వేవ్‌ల సమయంలో కొవిడ్ కేసులు, పీక్ టైమ్, మరణాల సంఖ్యలో ఐఐటీ కాన్పుర్ పరిశోధకుల బృందం గతంలో వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయి. ఈ అధ్యయనానికి 'బూస్ట్‌స్ట్రాప్' అనే పద్ధతిని పరిశోధకులు ఉపయోగించారు. ఇతర దేశాల్లో రాబోయే వేవ్‌లను కూడా అంచనా వేయొచ్చని తెలిపారు. దేశంలో కరోనా మొదలైన 936 రోజుల (జనవరి 30, 2020న తొలి కేసు నమోదు) తర్వాత నాలుగో వేవ్ వస్తుందని అంచనా వేశారు. కరోనా తొలిసారి 2020 జనవరి 30న వెలుగు చూడగా, అక్కడి నుంచి 936 రోజులకు నాలుగో విడత మొదలవుతుందని వారి గణంకాల ప్రక్రియ తెలియజేస్తోంది.