ఆ నలుగురి కలను నిజం చేసిన సీఎం.. అరగంట పాటు..
Four Tribals' First Flight Is On Shivraj Singh Chouhan's Official Chopper. వారిది సామాన్య జీవనం.. జీవితంలో ఎప్పటికైనా ఒక్కసారైన
By అంజి Published on 16 Sep 2021 4:15 AM GMTనా సోదరులు, సోదరీమణులు ముఖాల్లో చిరునవ్వు నాకు సంతోషాన్నిస్తుంది: సీఎం శివరాజ్ సింగ్
వారిది సామాన్య జీవనం.. జీవితంలో ఎప్పటికైనా ఒక్కసారైన హెలికాప్టర్ ఎక్కాలన్నది ఆ నలుగురి గిరిజనుల కోరిక. చివరకు వారి కోరిక నెరవేరింది. ఏకంగా సీఎం అధికారిక హెలికాప్టర్‌లో రైడ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన నలుగురు గిరిజనులు మొదటిసారిగా హెలికాప్టర్‌లో ప్రయాణం చేశారు. అది కూడా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క అధికారిక విమానంలో. ఇటీవల జోబాట్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కళావతి భూరియా కన్నుమూశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే జనదర్శన్ యాత్రలో భాగంగా సీఎం శివరాజ్ సింగ్.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా అక్కడి గిరిజనులు ఘన స్వాగతం పలికారు. సీఎం శివరాజ్ సింగ్ అక్కడి గిరిజనులతో నృత్యం చేశారు. అనంతరం పలు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు సీఎం రన్‌బిడా నుండి రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా జోబాట్ తహసీల్ నుండి నలుగురు గిరిజనులకు రన్‌బైడా నుండి సెజవాడ వరకు రైడ్ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించాడు. దీంతో జోబాట్ నుంచి వచ్చిన నలుగురు గిరిజనులు దరియావ్ సింగ్, మంగల్ సింగ్, రిచ్చు సింగ్ బాఘెల్, జోధ్‌సింగ్‌లు హెలికాప్టర్‌లో రైడ్ చేశారు. సుమారు అరగంట పాటు వారి రైడ్ సాగింది. ఈ సందర్భంగా ఆ నలుగురు గిరిజనులు సీఎం శివరాజ్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.