కస్టమర్లను చితక్కొట్టిన రెస్టారెంట్ ఉద్యోగులు

Four restaurant staffers held for beating up customers. ముంబై అంధేరిలో రెస్టారెంట్ మూసివేసిన తర్వాత వచ్చి ఆహారం అడిగిన కస్టమర్లను రెస్టారెంట్ సిబ్బంది

By M.S.R  Published on  11 Jan 2023 6:13 PM IST
కస్టమర్లను చితక్కొట్టిన రెస్టారెంట్ ఉద్యోగులు

ముంబై అంధేరిలో రెస్టారెంట్ మూసివేసిన తర్వాత వచ్చి ఆహారం అడిగిన కస్టమర్లను రెస్టారెంట్ సిబ్బంది చితక్కొట్టింది. ముగ్గురు వ్యక్తులను కొట్టినందుకు నలుగురు వెయిటర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 7వ తేదీ రాత్రి అంధేరీ-కుర్లా రోడ్డులోని ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగిందని ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి బాధితుడిని వెతికి పట్టుకున్నారు. నిందితులు ముగ్గురు వ్యక్తులపై వెదురు కర్రలతో దాడి చేశారు.

రెస్టారెంట్ యజమాని బాధితులను తిట్టడమే కాకుండా.. కొట్టమని వెయిటర్లను కోరాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 324, ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.


Next Story