కేంద్ర మాజీ పి. చిదంబరం చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాక్‌పై ప్రతీకార దాడి చేయకుండా వదిలేయడానికి కారణం అమెరికా సూచనలే అని, అలాగే విదేశాంగ శాఖ కూడా చర్యలకు వ్యతిరేకంగా నిలిచిందని ఆయన ఒప్పుకున్నారు. ఆ సమయంలో సైనిక చర్యలు పరిశీలించినప్పటికీ, అమెరికా ప్రభుత్వం భారత్‌ను “ఎస్కలేషన్ వద్దు” అని కట్టుదిట్టంగా హెచ్చరించిందని, దాంతోపాటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దాడికి అనుకూలంగా లేనందున యూపీఏ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చిదంబరం స్పష్టంచేశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌ను విమర్శించింది. “26/11 తర్వాత అమెరికా మాట విని పాక్‌పై దాడి చేయని కాంగ్రెస్ పార్టీ… నేడు మా సైన్యం చేసిన ఆపరేషన్ సింధూరాన్ని ‘సరెండర్’ అని విమర్శించడం పరాకాష్టైన ద్వంద్వ వైఖరి” అని బీజేపీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఈ వివాదంతో మళ్లీ యూపీఏ కాలం భద్రతా వైఫల్యాలు మరియు ప్రస్తుత ప్రభుత్వ దాడి ధోరణి రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారాయి.