మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు అస్వస్థత

Former PM Manmohan Singh Admitted To AIIMS With Fever And Weakness. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే

By Medi Samrat  Published on  13 Oct 2021 1:55 PM GMT
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు అస్వస్థత

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలోని ఎయిమ్స్‌ వైద్యుల బృందం మాజీ ప్రధానికి చికిత్సలు అందిస్తున్నది. జ్వరంతో పాటు శ్వాస సమస్యలు, చెస్ట్‌ పెయిన్‌ ఉన్నట్లు తెలుస్తున్నది. వైద్య బృందం ఆయ‌న‌కు ఫ్లూయిడ్స్‌ ఇస్తున్నది. ఇదిలావుంటే.. మన్మోహన్‌ సింగ్‌ ఈ ఏడాది ఏప్రిల్ లో కరోనా బారినపడ్డారు. జ్వరం ఉండడంతో ఎయిమ్స్‌లో చేర్పించిన సమయంలో కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అనంత‌రం ఆయ‌న‌ కోలుకున్నారు. 2004-2014 వరకు రెండు ప‌ర్యాయాలు భారత ప్రధానిగా సేవలందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌స్థాన్ రాష్ట్రం నుండి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.
Next Story
Share it