హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనం ఆదివారం హిసార్‌లో ప్రమాదానికి గురి అయింది. హర్యానాలోని హిస్సార్ జిల్లాలోని బర్వాలా సమీపంలో ప్రయాణిస్తూ ఉండగా ఆయన ఎస్‌యూవీని ఓ జంతువు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హుడా వాహనంలోని ఇతర ప్రయాణికులకు పెద్దగా గాయాలు అవ్వలేదు.
భూపిందర్ హుడా హిసార్‌లోని గిరాయే గ్రామంలో బాక్సర్ 'సావీటీ బూరా' ను సన్మానించే కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతుండగా వాహనం నీల్‌గాయ్‌ను ఢీకొట్టింది. ఆయన క్షేమంగా బయటపడ్డప్పటికీ, వారి వాహనానికి చాలా నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి వచ్చిన చిత్రాలు SUV ముందు రెండు ఎయిర్ బ్యాగ్‌లు తెరచుకున్నట్లు తెలుస్తోంది. భూపిందర్ సింగ్ హుడా మరొక వాహనంలోకి మారి.. షెడ్యూల్ చేసిన కార్యక్రమాలను కొనసాగించారు.