మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరిన మనీష్ సిసోడియా భార్య‌

Former Delhi Deputy CM Manish Sisodia's wife admitted to hospital. లిక్క‌ర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న‌ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియా

By Medi Samrat  Published on  4 July 2023 5:45 PM IST
మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరిన మనీష్ సిసోడియా భార్య‌

లిక్క‌ర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న‌ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియా సతీమణి సీమా సిసోడియా ఆరోగ్యం మరోసారి విషమించడంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో బాధపడుతున్న సీమా సిసోడియా.. ఆస్పత్రిలో చేరడం గ‌డిచిన కొన్ని రోజులుగా ఇది మూడోసారి. సీమా సిసోడియా (49) ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఏప్రిల్ నెలాఖరులో ఆమె ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు.


2000లో ఆమె మల్టిపుల్ స్క్లెరోసిస్, తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె గత 23 ఏళ్లుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శారీరక, మానసిక ఒత్తిడిని పెర‌గ‌డం వంటి ఇతర కారణాల‌తో వ్యాధి తీవ్ర‌త‌ర‌మ‌వుతుంద‌ని వెల్ల‌డించాయి.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. కుమారుడు విదేశాల్లో ఉన్నందున.. తన భార్య అనారోగ్య కారణాలతో బెయిల్‌ కోసం ఆయన గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. గ‌తంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. సీమా సిసోడియాను ఆసుప‌త్రిలో కలుసుకున్నారు. వారు ఆమెకు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.


Next Story