టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ కారు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌లోని సూర్వల్ వద్ద లాల్సాట్-కోట హైవేపై రణ్‌తంబోర్ పార్కు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో కారు బోల్తా పడింది. ప్రమాదంలో వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన తర్వాత అజార్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులను మరో వాహనంలో.. వారు బస చేస్తున్న హోటల్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలావుంటే.. అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 1992 నుంచి 1999 వరకూ భారత క్రికెట్ జట్టు తరఫున మూడుసార్లు ఐసీసీ వరల్డ్ కప్ పోటీలకు కెప్టెన్‌గా వ్యవహరించారు.