అనుమానాస్పద సందేశం.. ఆరు గంట‌లు ఆల‌స్యంగా బ‌య‌లుదేరిన విమానం

Flight Delayed By 6 Hours After Co-Passenger Raises Alarm Over Mobile Chat. మంగుళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం ఆదివారం ఆరు గంట‌లు ఆల‌స్యంగా వెళ్లింది.

By Medi Samrat
Published on : 15 Aug 2022 4:15 PM IST

అనుమానాస్పద సందేశం.. ఆరు గంట‌లు ఆల‌స్యంగా బ‌య‌లుదేరిన విమానం

మంగుళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం ఆదివారం ఆరు గంట‌లు ఆల‌స్యంగా వెళ్లింది. ఓ అనుమానాస్ప‌ద మెసేజ్ గురించి మ‌హిళా ప్ర‌యాణికురాలు విమాన సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయ‌డంతో ఆ విమానాన్ని కొన్ని గంట‌ల పాటు ఆపేశారు. తోటి ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌కు అనుమానాస్పద సందేశం రావడంతో ఓ మహిళా ప్రయాణికురాలు అప్రమత్తం చేయడంతో మంగళూరు-ముంబై విమానం ఆరు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఆదివారం సాయంత్రం ఇండిగో విమానాన్ని ముంబైకి బయలుదేరడానికి అనుమతించే ముందుఈ ఘటన చోటు చేసుకుంది.

విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌లో మెసేజ్‌ని గమనించిన ఓ మహిళా ప్రయాణికురాలు ఈ విషయాన్ని క్యాబిన్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను అప్రమత్తం చేయడంతో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానం తిరిగి బేకు చేరుకుంది. పూర్తిగా చెకింగ్ అయిన త‌ర్వాత 185 మంది ప్ర‌యాణికుల్ని మ‌ళ్లీ ముంబై విమానం ఎక్కించారు.

క్యాబిన్ సిబ్బంది ఆ విమానంలో ఉన్న ప్ర‌యాణికుల్ని దించేశారు. విమానాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌యాణికుల్ని అనుమ‌తించారు. ల‌గేజీని కూడా చెక్ చేశారు. దాడి జ‌రిగే ఛాన్సు ఉందంటూ వ‌చ్చిన మెసేజ్‌తో విమాన సిబ్బంది అప్ర‌మ‌త్త‌మైంది. టేకాఫ్ తీసుకునే స‌మ‌యంలో జ‌రిగిన ఈ ప‌రిణామంతో విమాన ప్ర‌యాణం అలా ఆరు గంట‌లు ఆల‌స్య‌మైంది.


Next Story