వర్షం పడుతుండగా పొలంలో పని చేస్తున్నాడు.. ఇంతలో..

Five killed in lightning strike incidents in Chhattisgarh’s Janjgir-Champa. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో శనివారం పిడుగుపాటుకు ఐదుగురు వ్యక్తులు

By Medi Samrat  Published on  7 Aug 2022 1:30 PM IST
వర్షం పడుతుండగా పొలంలో పని చేస్తున్నాడు.. ఇంతలో..

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో శనివారం పిడుగుపాటుకు ఐదుగురు వ్యక్తులు, 23 గొర్రెలు మృతి చెందాయి. మరో ఐదు గ్రామాల్లో జరిగిన ఈ ఘటనల్లో నలుగురు గాయపడ్డారు. మృతుల్లో కియారీ గ్రామానికి చెందిన శ్యామ్ కుమారి (18), అదే గ్రామానికి చెందిన అనిల్ యాదవ్ (30) ఉన్నారు.

అకల్తారా ప్రాంతంలోని మధువా గ్రామానికి చెందిన మహేశ్ డోంగ్రే (56) వర్షం పడుతుండగా పొలంలో పని చేస్తున్నాడు.. ఆ సమయంలో ఆకాశం నుంచి వచ్చిన పిడుగు కారణంగా అతడు మృతి చెందాడు. చోరభట్టి గ్రామంలో 50 ఏళ్ల దిలీప్ యాదవ్ తన కొడుకుతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. చంపా ప్రాంతానికి సమీపంలోని సియోని గ్రామంలో ఇలాంటి ఘటనలో విజయ్ రాథోడ్ అనే వ్యక్తి చనిపోయాడు.




Next Story