వన్ నేషన్-వన్ ఎలక్షన్.. మొదటి మీటింగ్ ఎప్పుడంటే?

'వన్ నేషన్ వన్ ఎలక్షన్' కమిటీ తొలి అధికారిక సమావేశం సెప్టెంబర్ 23న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

By Medi Samrat
Published on : 16 Sept 2023 7:50 PM IST

వన్ నేషన్-వన్ ఎలక్షన్.. మొదటి మీటింగ్ ఎప్పుడంటే?

'వన్ నేషన్ వన్ ఎలక్షన్' కమిటీ తొలి అధికారిక సమావేశం సెప్టెంబర్ 23న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన జరగనుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, గులాంనబీ ఆజాద్‌, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉన్నారు.

కమిటీ సమావేశాలకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు, న్యాయ వ్యవహారాల కార్యదర్శి నితేన్ చంద్ర ప్యానెల్‌కు కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ నిర్దిష్ట సవరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం అవసరమయ్యే సవరణలు, ఏవైనా ఇతర చట్టాలు, నియమాలను పరిశీలించి, సిఫారసు చేయనున్నారు. రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరమైతే అది కూడా పరిశీలించాలని సిఫార్సు చేసే అవకాశం ఉంది.

Next Story