గుజరాత్‌లో కోవిడ్-19 'XE వేరియంట్' మొదటి కేసు
First case of XE variant of Covid-19 found in Gujarat. ముంబైలో కొత్త కోవిడ్ -19 వేరియంట్ XE కేసు కనుగొనబడిందని వార్తలు వెలువడిన తర్వాత..
By Medi Samrat Published on 9 April 2022 3:44 PM ISTముంబైలో కొత్త కోవిడ్ -19 వేరియంట్ XE కేసు కనుగొనబడిందని వార్తలు వెలువడిన తర్వాత.. గుజరాత్‌లో ఒక వ్యక్తికి కొత్త కోవిడ్ -19 వేరియంట్ సోకినట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో కనుగొనబడిన XE వేరియంట్ తో పాటు, కోవిడ్ -19 యొక్క కొత్త XM వేరియంట్ కు సంబంధించి ఒక కేసు గుజరాత్‌లో కనుగొనబడిందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. మహారాష్ట్రలోని ముంబై నగరంలో XE వేరియంట్ కనుగొనబడిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. రోగికి విదేశీ ప్రయాణ చరిత్ర ఉంది. కరోనావైరస్ కొత్త వేరియంట్ సంక్రమించినట్లు నివేదించబడింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ వాదనలను తిరస్కరించింది.
XE వేరియంట్ ముంబైలో ఉన్నట్లు నివేదికను ఆరోగ్య మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. "కొత్త వేరియంట్ ఉనికికి సంబంధించి ఆధారాలు ఏవీ కనిపించలేదు" ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. PIB మహారాష్ట్ర పోస్ట్ చేసిన ఒక ట్వీట్‌లో, "ముంబయిలో కరోనావైరస్ యొక్క XE వేరియంట్‌ను గుర్తించినట్లు నివేదించబడిన కొన్ని గంటల తర్వాత, @MoHFW_INDIA ప్రస్తుత సాక్ష్యం కొత్త వేరియంట్ ఉనికిని సూచించడం లేదని పేర్కొంది." అని తెలిపింది.
కోవిడ్-19 కొత్త XE వేరియంట్ మొదట యునైటెడ్ కింగ్‌డమ్‌లో కనుగొనబడింది. వైరస్ ఇతర వేరియంట్ ల కంటే చాలా ఎక్కువ వ్యాప్తి చెందుతోందని చెప్పబడింది. XE వేరియంట్ ఇప్పటి వరకు అనేక దేశాలలో కనుగొనబడింది, 600 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి యొక్క నాలుగో వేవ్ గురించి చాలా మంది నిపుణులు అంచనా వేసినప్పటికీ, XE వేరియంట్ భారతదేశంలో పెద్దగా నష్టం కలిగించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే అందరూ అలర్ట్ గా ఉండాలని అవసరమైన అన్ని కోవిడ్-19 ప్రోటోకాల్‌లను అనుసరించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే కోవిడ్-19 XE వేరియంట్‌ను ఆందోళనకు గురిచేసే వేరియంట్‌గా వర్గీకరించింది. ప్రస్తుతం దాని వల్ల కలిగే ముప్పు స్థాయిని తెలుసుకోవడానికి దానిపై మరిన్ని పరిశోధనలు నిర్వహిస్తోంది.