నేటి నుంచి జనవరి 1 వరకు బాణాసంచా కొనుగోలు, అమ్మకాలపై నిషేధం

ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపీసీసీ) నేటి నుండి అంటే అక్టోబర్ 14 నుండి జనవరి 1 వరకు రాజధానిలో బాణాసంచా కొనుగోలు, అమ్మకాలపై పూర్తి నిషేధం విధించింది

By Medi Samrat  Published on  14 Oct 2024 7:01 PM IST
నేటి నుంచి జనవరి 1 వరకు బాణాసంచా కొనుగోలు, అమ్మకాలపై నిషేధం

ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపీసీసీ) నేటి నుండి అంటే అక్టోబర్ 14 నుండి జనవరి 1 వరకు రాజధానిలో బాణాసంచా కొనుగోలు, అమ్మకాలపై పూర్తి నిషేధం విధించింది. ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా పటాకుల కొనుగోలు, అమ్మకాలపై కూడా నిషేధం విధించబడింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గత కొన్నేళ్లుగా దీపావళికి ముందు పటాకుల కొనుగోలు, అమ్మకాలపై నిషేధం విధిస్తుంది. అయితే రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టడంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చర్యలు పూర్తిగా అసమర్థంగా నిరూపించబ‌డుతున్నాయి.

ఢిల్లీ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పటాకులు తీసుకురావ‌డం.. దీపావళి రాత్రి విస్తారంగా వాటిని పేల్చ‌డం కనిపిస్తూనే ఉంటుంది. దీపావళి రెండవ రోజు కాలుష్య స్థాయి.. సాధార‌ణ‌ రోజులతో పోలిస్తే తీవ్రంగా నమోదవుతోంది. గత సంవత్సరం 2023లో దీపావళి నవంబర్ 12న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. దీపావళి రాత్రి, మరుసటి రోజు ఉదయం రాజధానిలో గాలి నాణ్యత సూచిక 'వెరీ సీరియస్' కేటగిరీలో నమోదైంది. బాణాసంచా కాల్చిన 40 మందిపై కేసులు నమోదు చేయడం గ‌మ‌నార్హం. మ‌రి ఈసారి ఎంత‌వ‌ర‌కూ క‌ట్ట‌డి చేస్తారో చూడాలి మ‌రి.

Next Story