ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్ర‌మాదం

Fire Accident In Delhi AIIMS. ఢిల్లీఎయిమ్స్ లో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఎయిమ్స్ స్టోర్ రూములో సోమ‌వారం తెల్ల‌వారుజామున

By Medi Samrat
Published on : 28 Jun 2021 12:14 PM IST

ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్ర‌మాదం

ఢిల్లీఎయిమ్స్ లో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఎయిమ్స్ స్టోర్ రూములో సోమ‌వారం తెల్ల‌వారుజామున 5గంట‌ల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ప్ర‌మాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్ర‌స్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక విభాగం అధికారి తెలిపారు. బహుశా షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్టు ఎయిమ్స్ అధికారులు వెల్లడించారు.

గతంలో కూడా ఎయిమ్స్ లో అగ్నిప్రమాదాలు జరిగాయి. జూన్ 17న 9వ అంత‌స్థులో జ‌రిగిన‌ ఫైర్ యాక్సిడెంట్‌లో స్టోర్ రూమ్ లోని కొన్ని రికార్డులు కూడా కాలిపోయాయి. అప్పుడు 26 ఫైరింజ‌న్లతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.


Next Story