దేశ ప్రజలకు ఆర్థిక శాఖ.. లక్షలు గెలుచుకునే పోటీ..!

Finance Ministry with MyGov India announcing contest. దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశపెట్టిన కొత్త పథకానికి

By Medi Samrat  Published on  28 July 2021 9:13 AM GMT
దేశ ప్రజలకు ఆర్థిక శాఖ.. లక్షలు గెలుచుకునే పోటీ..!

దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశపెట్టిన కొత్త పథకానికి అనువైన పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోలను సూచించిన వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించింది. కేంద్రం ఇటీవలే మౌలిక సదుపాయల కల్పన కోసం డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్సిస్టి‍ట్యూషన్‌కి ఆమోదం తెలిపింది. డీఎఫ్‌ఐ. తీరు తెన్నులు, లక్ష్యాలను స్ఫూరించేలా ఈ పథకానికి పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోలను సూచించాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఆగస్టు 15వ తేది సాయంత్రం 5:30 గంటల్లోగా తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది.


ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. 5 లక్షల వంతున మొత్తం రూ. 15 లక్షలు బహుమతిగా అందిస్తామని పేర్కొంది. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన ఎంట్రీలకు రూ. 2 లక్షల వంతున బహుమతులు అందివ్వనున్నారు. దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలందరికీ తేలికగా అర్థం అయ్యేలా, పలకడానికి సులువుగా ఉండేలా డీఎఫ్‌ఐకి సంబంధించిన పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోలు ఉండాలని తెలిపింది. పేరు, ట్యాగ్‌లైన్‌, లోగో డిజైన్లు రూపొందించిన వారు https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్‌ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపొచ్చు. డిజైన్లు పూర్తయిన వెంటనే ఆగస్టు 15వతేది సాయంత్ర 5.30 సమయానికి ఆర్ధికశాఖ వెబ్ సైట్ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపించాల్సి ఉంటుంది. ఎవరి అదృష్టం ఎలా ఉండనుందో.. మీరు కూడా ఓ ట్రై చేయడంలో ఎలాంటి తప్పూ లేదు..!


Next Story