అస్వస్థతకు గురైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Finance Minister Sitharaman admitted to AIIMS. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అస్వస్థతకు గురయ్యారు.

By Medi Samrat
Published on : 26 Dec 2022 3:19 PM IST

అస్వస్థతకు గురైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. నిర్మలా సీతారామన్‌ ఆదివారం మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. 63 ఏళ్ల నిర్మలా సీతారామన్‌ ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో చేరారు. అధికారిక వర్గాల ప్రకారం.. డీహైడ్రేషన్ కారణంగా సీతారామన్ ఆసుపత్రిలో చేరిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story