రైతుల సత్యాగ్రహం అహంకారాన్ని ఓడించింది : రాహుల్ గాంధీ

Farmers satyagraha defeated arrogance says Rahul Gandhi.దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2021 6:07 AM GMT
రైతుల సత్యాగ్రహం అహంకారాన్ని ఓడించింది : రాహుల్ గాంధీ

దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు కొన‌సాగిస్తున్న ఉద్య‌మానికి ఏడాది పూర్తి అవుతున్న త‌రుణంలో కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ప్ర‌తి ప‌క్షాలు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రైత‌న్న‌లు సాధించిన విజయంగా అభివ‌ర్ణిస్తున్నాయి.

కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర‌ప్ర‌భుత్వం అహంకారాన్ని రైతుల స‌త్యాగ్ర‌హం ఓడించిందన్నారు. రైతు చ‌ట్టాలు తీసుకురావ‌డ‌మే త‌ప్ప‌ని, రైతులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నార‌ని, ఈ పోరాటంలో అనేక‌మంది అన్న‌దాత‌లు ప్రాణాలు కోల్పోయారు. ఎట్ట‌కేల‌కు కేంద్రం దిగివ‌చ్చి రైతుల‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రాహుల్ గాంధీ గ‌తంలో మాట్లాడిన వీడియోను కూడా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. రైతు చ‌ట్టాల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకునేలా చేస్తామ‌ని, త‌న మాటాల‌ను గుర్తుపెట్టుకోవాలంటూ ఆ వీడియో రాహుల్ చెప్పాడు.

క్రూర‌త్వానికి చ‌లించ‌కుండా అలుపెర‌గ‌ని పోరాటం చేసిన ప్ర‌తి ఒక్క రైతుల‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ఇది మీ విజ‌యం. ఉద్య‌మంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్న‌ట్లు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీ తెలిపారు.

న‌ల్ల చ‌ట్టాలు ర‌ద్దు స‌రైన ముంద‌డుగు, రైతుల స‌త్యాగ్ర‌హం చారిత్ర‌క విజ‌యం సాధించింది. అన్న‌దాత‌ల త్యాగాలు ఫ‌లించాయ‌ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ న‌వ్య‌జోత్ సింగ్ సిద్దు అన్నారు.


Next Story